జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము నందు జిల్లా క్వాలిటీ అసురన్స్ కమిటీ సమావేశము కమిటీ చేర్పర్సన్ అయిన కలెక్టర్ తమీమ్ అన్సారీయా బుధవారం నిర్వహించారు ఈ సమావేశము నందు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఏరియా ఆసుపత్రులు సామజిక ఆరోగ్యకేంద్రాలు మరియు ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్లలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబన్ధనలమేరకు జిల్లా క్వాలిటీ అసురన్స్ కమిటీ పనిచేయవలెనని సూచించారు ముఖ్యముగా ఓ.పి, లేబర్ రూమ్ చిన్నపిల్లల మరియు గర్భిణీస్త్రీల వార్డ్ మందులు ఇచ్చు విభాగము పరిపాలన విభాగములు క్వాలిటీ అసురన్స్ కమిటీ ఇచ్చిన లక్షముల ప్రకారము పనిచేయవలెనని తెలిపినారు.