వెంకటాపురం మండలం ములుగు-పరకాల ప్రధాన రహదారిపై లారీ దిగబడింది. బుధవారం ఉదయం తారు రోడ్డుపై లారీ దిగబడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రహదారి ఇలా ఉంటే ప్రయాణాలు చేసేది ఎలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు .