ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగు పై ఉన్న లో లెవెల్ వంతెన పై నుండి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జాతీయ రహదారి కావడంతో లారీలు వంతెన దాటుతుండగా వరద ఉధృతి పెరగడంతో మూడు లారీలు వరదల్లో చిక్కుకున్నాయి. ఐతే లారీల డ్రైవర్లు క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. కాగా రాత్రి సైతం రాకపోకలు నిలిచిపోవడంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తర్నం వాగు ప్రాంతాన్ని పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న లారీలను పరిశీలించి, అక్కడ ఉన్న డ్రైవర్లతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్