నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోఅద్భుతం చోటుచేసుకుంది.శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది.మహానంది చిన్న కోనేరులో వర్షపు నీరు కలవగా మహానందీశ్వర స్వామి గర్భాలయం నుంచి వచ్చే నీటి స్పష్టత మాత్రం అలాగే ఉండడం అరుదైన దృశ్యంగా ఆవిష్కృతమైంది. బయటి చిన్న కోనేరులో వర్షపు నీరు కనిపించగా లోపలి కోనేరు నుంచి వచ్చే జలధార మాత్రం తన స్వచ్ఛతను కోల్పోకపోవడంపై స్వామి వారి మహిమ గానే భావించాలని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.