జిల్లాలో ఈద్ మిలాద్ ఉన్ నభి పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు చేపట్టిన ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని శుక్రవారం మధ్యాహ్నం విజయనగరంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించి మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం హిందూ సోదరులు నిలిచారన్నారు. జిల్లాలో ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా డ్రోన్స్ తో పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు.