నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో పర్యావరణ పరిరక్షణకై ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని నిమజ్జన శోభాయాత్రను మంగళవారం వైభవంగా నిర్వహించారు. నిమజ్జన వేడుకలకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన డోల్ వాయిద్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి ప్రతిష్టించామని సంసృతి సాంప్రదాయబద్దంగా శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు.