రుద్రూర్ మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని బిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఆదివారం 11:30 గంటలకు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1969లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ కొరకు తన పదవికి రాజీనామా చేసి పోరాటం చేసిన యోధుడని కొనియాడారు.