కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని తమ్మవరం రోడ్డులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బస్సును ఫోర్ వీలర్ ఆటో అంచులన ఢీకొని వెనకనే ఉన్న మరో బస్సును ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. డ్రైవర్లు ద్విచక్ర వాహనంపై ఆటో కోసం గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.