Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ఘనంగా విశ్వమాత మదర్ తెరిసా జయంతి వేడుకలు

Kalyandurg, Anantapur | Aug 26, 2025
కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం విశ్వమాత మదర్ తెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామాజిక కార్యకర్త కిషోర్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు లింగప్రసాద్, మల్లికార్జున, నారాయణ, సోమశేఖర్ తదితరులు మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కిషోర్ మాట్లాడారు. విశ్వమాతగా పేరుగాంచిన మదర్ తెరిసా ఎంతోమంది అనార్తులను అక్కున చేర్చుకుని సేవలు చేశారన్నారు. అందరూ మదర్ తెరిసా అడుగుజాడల్లో నడవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us