శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆల్ ఇండియన్ స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర రెడ్డి, పోతులయ్యల ఆధ్వర్యంలో జాతీయ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 11,12,13 తేదీల్లో కడపలో నిర్వహించే ఏఐఎస్బీ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.