బుచ్చిలో మోస్తరు వర్షం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో వినాయకుడి విగ్రహాలు తరలించడానికి పలువురు ఇబ్బందులు పడ్డారు. విగ్రహాలు తడవకుండా పట్టలను కప్పుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. అనుకోకుండా వర్షం రావడంతో పూజా సామాగ్రి కొనుగోలుకు వచ్చిన ప్రజలు అసౌకర్యానికి గురయ్యా రు. మరోవైపు ఈ వర్షంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి.