తిరుపతి జిల్లా , చిట్టమూరు మండల పరిధిలోని సోమసముద్ర గ్రామంలో ఉన్న స్మశాన వాటికను వేరొకరికి స్వాధీనం చేయాలనీ మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సర్వేయర్ అడ్డుకుని రౌడీలా , రాజకీయ నాయకులకు తొత్తుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు