Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
శక్తి పథకం అమలులో భాగంగా ఉదయగిరి ఆర్టీసీ డిపోను బుధవారం వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో, ప్రజలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.