న్యాయపరమైన వివాదాలను మధ్యవర్తిత్వ న్యాయవాదులు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్య దర్శి కె.హరిబాబు సూచించారు. సోమవారం శ్రీకాకుళం న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కక్షిదారుల పట్ల మరిన్ని న్యాయపరమైన పద్ధతులు, అవలంబించుకునే తీరును గురించి ఆయన వివరించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను ప్రజలు వినియోగించుకోవాలి అని కోరారు.