పాతపట్నం నియోజకవర్గంలో రెండు జూనియర్ సివిల్ కోర్టులకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొరారు. పాతపట్నం కోర్టు 1963, కొత్తూరు కోర్టును 2013లో ఏర్పాటు చేశారన్నారు. ఇవి శిథిలస్థితికి చేరుకున్నాయని, ఇక్కడకి కేసుల నిమిత్తం వచ్చిన వారితో పాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త భవానాలు నిర్మించాలని సంబంధిత మంత్రికి ఇవాళ అసెంబ్లీలో విన్నవించారు.