నంద్యాల జిల్లా బేతంచెర్ల - నంద్యాల రోడ్డులో శనివారం అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో బుగ్గనపల్లి వైపు నుంచి బేతంచర్లకు ఇద్దరు యువకులు బైక్పై వస్తుండగా డివైడర్కు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిలో ఒకరు బేతంచర్లకు చెందిన అజయ్, రెండో వ్యక్తి బుగ్గన పల్లె తండాకు చెందిన మోహన్ నాయక్. గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో ఇద్దరినీ బేతంచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమ చికిత్సలు నిర్వహించి కర్నూల్కు తరలించారు.