సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు రిజర్వాయర్లోకి గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి 40,069 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారి మహిపాల్ రెడ్డి గురువారం మధ్యాహ్నం తెలిపారు రిజర్వాయర్ నుంచి దిగివకు 30,357 క్యూ సిక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టిఎంసిలు కాగా ప్రస్తుతం 17.955 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.