బోడుప్పల్ చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో ఆదివారం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిలుగొండ వరలక్ష్మీ వెంకటేష్ గౌడ్, సిల్వ సుమలత రవీందర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గణపతి హోమం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. చిన్న క్రాంతి కాలనీ కమిటీ ప్రజలందరిపై గణపతి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు.