తిరుపతి జిల్లా వాకాడు మండలం గూడూరు డిఎస్పి గీతా కుమారి ఆదేశాల మేరకు వాకాడు సీఐ హుస్సేన్ భాష, ఎస్సై నాగబాబు సూచనల మేరకు తూపిలిపాలెం బీచ్ వద్ద వినాయక చవితి ఉత్సవ నిమజ్జన కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వారి సిబ్బంది ద్వారా, తూపిలిపాలెం గ్రామ ప్రజల సహాయంతో కట్టుదిట్టమైనఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే దూర ప్రాంత భక్తులు మద్యం సేవించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాలని ప్రజలను కోరారు