యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మందుల సామేలు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు.