శ్రీకాళహస్తిలో వినాయక చవితి సందడి శ్రీకాళహస్తిలో వినాయక చవితి సందడి వాతావరణం నెలకొంది. మట్టి వినాయకులు, రంగురంగుల వినాయక విగ్రహాలు ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. మట్టి విగ్రహాలు 50 రూపాయల నుంచి 1,600 వరకు పలుకుతున్నాయి. గణనాథుని పూజకు అవసరమైన అరటి చెట్లు, సజ్జ కంకిలు, చెరకు గడ్డలు, గరిక వంటివి ప్రజలు కొనుగోలు చేశారు.