ఆదిలాబాద్ లోని ఓ ఏటీఎం లో చోరీకి యత్నించిన దొంగను పోలీసులు 24 గంటల్లోపే పట్టుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ లోని కిసాన్ చౌక్ లో గల డి.బి.ఎస్ బ్యాంక్ కు సంబంధించిన ఏటీఎం సెంటర్ లో మంగళవారం తెల్లవారుజామున దొంగతనానికి యత్నించిన బిప్లబ్ కుమార్ జెన నిందితున్ని పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుడు నుండి ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టేందుకు ఉపయోగించిన గడ్డపార తో పాటు, ఓ సెల్ఫోన్, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు ఒడిస్సా రాష్ట్రంకు చెందిన వాడన్నారు.