సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లో భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మారిన వాతావరణంతో గంటపాటు వర్షం కురిసింది. పట్టణంలోని జాతీయ రహదారితో పాటు పలు కాలనీలో వర్షంతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. నియోజకవర్గంలోని కోహిర్, న్యాల్కల్, జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో భారీగా వర్షం కురిసినట్లు స్థానికులు తెలిపారు. పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు భారీ వర్షంతో ఎక్కడికక్కడ నిలిచిపోయారు.