జాతీయ మాల మహానాడు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో బాగంగా సోమవారం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు మాల మహానాడు నాయకులు నిరసన తెలిపి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిఓ 99 ద్వార విద్యా ఉద్యోగాల్లో మాల మరియు దాని అనుబంధ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జిఓ 99 సవరణ కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి గ్రూప్ 3 లోని ఎస్సీ మాల దాని అనుబంధ 26 కులాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఈ సందర్భంగా జీవో 99 కాపీలను మాల మహానాడు నాయకులు చించివేశారు.