కాగజ్ నగర్ పట్టణంలోని కాపు వాడలో గల శ్రీ సాయి గణేష్ మండలి వారు ప్రత్యేకంగా 16 కిలోల కాబూలీ శనిగలతో 6400 గింజలతో గణనాధుని ప్రత్యేకంగా తయారు తయారు చేయించడంతో పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 14 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకై తీరక దినుసులతో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా గణనాధుని తయారు చేయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ఆకర్షణగా కాపు వాడలోని గణనాథుడు నిలుస్తున్నాడని పట్టణవాసులు తెలిపారు,