ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ ను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఎస్సార్ నగర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఆన్లైన్ గేమింగ్ యాప్ నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. నిషేధిత కే లో గేమింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 18 మొబైల్ ఫోన్లు మూడు పాసుబుక్కులు 13 ఏటీఎం కార్డులను సీజ్ చేసినట్లు తెలిపారు, 29 లక్షల నగదును బ్లాక్ చేసినట్టు పోలీసులు అన్నారు.