నేరేడ్మెట్ డివిజన్ క్రాస్ రోడ్డు బృందావన్ కాలనీ ఎస్బిఐ బ్యాంకు ఏరియాలో రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రోడ్డుపై నడవలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.