సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో కూటమి విఫలమైందని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ విమర్శించారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూటమి విఫలమైందన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను గత ఏడాది ఇవ్వలేదని ఆరోపించారు. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.