అందాల పోటీలకు ఉన్న నిధులు విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ కు లేవా అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కరీంనగర్ లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాలలు బంద్ చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కళాశాలలకు వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇవ్వడం లేదని అన్నారు.