అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా ఓ.ఆనంద్ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు డిఆర్ఓ ఏ.మలోల, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్ పూల మొక్కలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ దేవుని పటానికి నమస్కరించారు. తదనంతరం నూతన జిల్లా కలెక్టర్ గా ఓ.ఆనంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు ఆశీర్వాదం అందజేశారు.