ముక్కంటి హుండి ఆదాయానికి ఎసరు: మాజీ ఛైర్మన్ ముక్కంటి హుండీ రాబడికి ఎసరు పెట్టే విధంగా వ్యవహరించండం ఎంతవరకు సమంజసం అని ఆలయ మాజీ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రశ్నించారు. రూ.30 లక్షల శానిటరీ కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేసి, కొత్త కాంట్రాక్టరుకు అధిక మొత్తానికి అప్పజెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఆలయంలో ఇప్పటి వరకు భక్తుల దోపిడీ జరిగిందని, ఇకపై దేవుడినే దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.