ఇందిరమ్మ ఇండ్లను వేగవంతంగా నిర్మించాలని హౌసింగ్ శాఖ కామారెడ్డి డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం బీబీపేటలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలలో లబ్ధిదారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఇండ్లు నిర్మించుకున్న వారికి దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పూర్ణ చంద్రోదయ కుమార్ పాల్గొన్నారు.