నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొమ్మూరు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం మేరకు మధ్యాహ్న భోజన ఏజెన్సీని అధికారులు మార్పు చేశారు. మంగళవారం గ్రామంలో తహశీల్దార్ నాగమణి, ఎంపీడీవో ఫజుల్ రహమాన్, ఎంఈఓ సోమశేఖర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి నూతనంగా గ్రామానికి చెందిన హెడ్ కుక్గా ఎల్లమ్మ, అసిస్టెంట్ కుక్గా ప్రభావతిని ఎంపిక చేశారు.