భీమిలి తీరప్రాంతం కోతకు గురవుతున్నా రక్షణ గోడ నిర్మాణంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు ప్రశ్నించారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భీమిలి తీరప్రాంతం కోతకు గురవుతుందని, రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్నిసార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా బూడిదలో పోసిన పన్నీరుగానే అధికారుల నిర్లక్ష్యం ఉందని అన్నారు.