ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం నల్లమల అడవిలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. సంబంధిత వివరాలను ఎస్ఐ మహేష్ మంగళవారం తెలిపారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మండలానికి చెందిన సాయికుమార్ బెట్టింగ్ చెడు వ్యసనాలకు బానిసై అప్పు చేశారు. దీంతో అప్పు బాధ తట్టుకోలేక ఆగస్టు 27వ తేదీ ఇంటి నుండి వెళ్లిపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారుట్ల సమీపంలో మోటార్ బైక్ రోడ్డుపై నుంచి అడివిలోపల చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.