జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ ఒలంపియాడ్ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ శుక్రవారం నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు పెట్టారు. ఇందులో 47 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధరందీప్ పాటిల్, మండల కన్వీనర్ సంజీవరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.