వర్తక వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహం ఇస్తుందని డిప్యూటీ జనరల్ మేనేజర్ వై.శ్యామలాదేవి తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న ఎస్ కన్విన్స్ హాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు పిఠాపురం సెంట్రల్ బ్యాంక్ శాఖ కస్టమర్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ క్రెడిట్ ఆఫీస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వై.శ్యామలాదేవి, రీజినల్ మేనేజర్ ఏవి రమణమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాకు వివరాలు తెలిపారు.