పీ.ఎం.జె.వి.కె సూర్య ఘర్ పథకం టూరిజం అభివృద్ధి పనుల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి లబ్ధిదారులకు త్వరితగతిన లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో పీ.ఎం.జె.వి.కె సూర్య ఘర్ పథకాల అమలు, టూరిజం అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.