పెద్దమండ్యం మండలం గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నారి ఫర్హానా తన తండ్రిని బతికించాలని సీఎం, డిప్యూటీ సీఎంలను వేడుకుంటోంది.ఫర్హానా తండ్రి నూరూ సాహెబ్‌కు ఐదేళ్ల క్రితం ముక్కులో క్యాన్సర్ గడ్డ ఏర్పడి, అది క్రమంగా కన్ను వరకూ వ్యాపించింది. చదువుమానేసి, ఉన్నదంతా అమ్మి కుటుంబం తిరుపతి, హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించింది. ఇప్పుడు ఆపరేషన్ ఖర్చు రూ.15 లక్షల వరకు అవుతుందని వైద్యులు తెలిపారు.తండ్రిని కాపాడాలని చిన్నారి కన్నీరు మున్నీరవుతోంది.