సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డిఎస్పి నాగేందర్ గౌడ్ తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో భక్తిశ్రద్ధలతో పండగ జరుపుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, పలు పార్టీల నాయకులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు