రోడ్లపై వర్షపు నీరు నిలువ ఉండకుండా అధికారులు చూడాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. మంగళవారం సమయంలో విజయవాడ బందర్ రోడ్డు ఏలూరు రోడ్ సింగినగర్ ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. రోడ్లపై చెత్తాచెదారాలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా కార్మికులు విధి నిర్వహణ చేయాలని ఎవరైనా విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రోడ్లపై వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని తెలిపారు