కోవూరు పోలీసుల కస్టడికీ అరుణ రౌడీ షీటర్ ప్రియురాలు అరుణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. బిల్డర్ను బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈకేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు అరుణను మూడు రోజుల కస్టడికీ తీసుకున్నారు. ఒంగోలు జైలు నుంచి కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడే ఆమెను విచారించనున్నారు.