బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించడానికి తన వద్దకు వచ్చి, చివరికి తనపైనే అక్రమ కేసు నమోదు చేశారని గుంటూరు నల్లచెరువు కు చెందిన దివ్య అనే మహిళ ఆరోపించింది. ఈ కేసు విషయమై గత నెల రోజులు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు తిరుగుతుంటే ఎస్సై నరసింహారావు రూ. 35 వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది. గత రాత్రి డబ్బులు లేవని చెప్పడంతో నీకు న్యాయం జరగదు అంటూ ఎస్సై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆమె తెలిపింది. దీంతో మనస్థాపం చెంది ఎలుకల మందు సేవించినట్లు చెప్పింది. అరండల్ పేట పోలీసులు తనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సోమవారం మధ్యాహ్నం మీడియాకు తెలిపింది.