అహోబిలంలో సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిర్వహించే పవిత్రోత్సవాలు ఎగువ అహోబిలంలో 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయని అర్చకులు వేణుగోపాలన్ పేర్కొన్నారు. శనివారం విశ్వక్సేనారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణం, అధివాస హోమం, అధివాస పవిత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు 16 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.