నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ కేంద్రంలోని వేలాది మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్,ఖమ్మపాటి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నంత చదువుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నాటి ప్రభుత్వం తీసుకొని వచ్చిందన్నారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.