సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో గ్రామ పాలన అధికారులు (జీపీవో) ఉద్యోగాలకు కౌన్సిలింగ్ సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాధురి, కలెక్టరేట్ ఏవో అంథోనీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది. జీపీవోలకు గ్రామాలను కేటాయించారు. పోస్టింగ్ అందుకున్న జీపీవోలు వెంటనే విధుల్లో చేరాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.