సెప్టెంబర్ 19న ఇందిరాపార్క్ వద్ద జరగనున్న లంబాడీల ఆత్మగౌరవ సభకు తెలంగాణ బంజారా సమాజం ఐక్యంగా తరలిరావాలని ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన విద్యార్థి నాయకుడు గుగులోతు విజయ్ నాయక్ పిలుపునిచ్చారు. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించే ప్రయత్నాలను తిప్పికొట్టేలా ఈ సభలో ఐక్యతను ప్రదర్శించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో లంబాడీల ఆత్మగౌరవ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.