యాడికి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ గా పనిచేస్తున్న వసుంధర టీచర్ పోస్టుకు ఎంపికైంది. అదేవిధంగా నగరూరుకు చెందిన చిన్న ఓబన్న కూడా టీచర్ పోస్టుకు ఎంపికయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన మెగా డీఎస్సీ ఫలితాలు వసుంధర 85 మార్కులు సాధించి టీచర్ పోస్ట్ కు ఎంపికైంది. చిన్న ఓబన్న 76.6 మార్కులు సాధించి టీచర్ పోస్ట్ కు ఎంపికయ్యారు. టీచర్ పోస్ట్ కు ఎంపికైన వసుంధర, చిన్న ఓబన్నను స్నేహితులు, సన్నిహితులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.