కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదివారం మద్యాహ్నం 12 గంటల సమయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కామారెడ్డి పట్టణంలో ఇలాంటి విపత్తు రావడం చాలా బాధాకరం అన్నారు. వరద బాధిత కుటుంబాలకు పర్యటనలు, పరామర్శలు ముఖ్యం కాదు, సహాయం చేయడం, వారిని అందుకోవడం ముఖ్యమన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు కామారెడ్డినియోజకవర్గంలో నాలుగు మంది చనిపోవడం జరిగిందన్నారు. వాతావరణ శాఖ, అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఘోరం, ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. వరద బాధిత కుటుంబాలకు కనీసం పునరావాసం కల్పించలేదన్నారు.