ఆళ్లగడ్డలోని కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చని, ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ.22 వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.